నాగార్జున సాగర్ గురుకుల డిగ్రీ కళాశాల

నాగార్జున సాగర్ గురుకుల డిగ్రీ కళాశాల రజత్సోవ సంచికకు ఎదయినా రాయాలి అని గత వారం రోజులుగా అనుకుంటున్నా, కాని అర్థం కావడం లేదు ఎక్కడ మోదలు పెట్టాలో. కరువు జిల్లా పాలమూరు లో,దిగువ మధ్యతరగతిలో పుట్టడం వల్ల,చదువంతా కష్టంగా గడిచింది.జడ్చర్లలో ఇంటర్ కాగానే చదువు ఆగుతుందా,సాగుతుందా అని చింతిస్తున్న సమయంలో ఆపద్భాధవుడి మాదిరిగా దొరికింది సాగర్ కాలేజిలో ప్రవేశం.

ఇక్కటి ప్రశాంత వాతవరణం,చదువు,వసతి, భోజనం ఉచితం కావడం బాగా కలసి వచ్చింది, దానికి తోడు రాష్ట్రం నలుమూలల నుంచి విధ్యార్థులు ఉండటం,మంచి అధ్యాపకులు ఉండటం జీవితంపై ఆశను పెంచి భవిష్యత్తుకు మంచి పునాది రాళ్ళు పడటానికి బాగా దోహదం చేసింది.

డిగ్రీ అంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ పి.జి ఎంట్రెన్సులకు ప్రిపేరు కావడం అని కాకుండా,ఇక్కడ నేను చాలా విధాలుగా లబ్ది పొందాను. లైబ్రరీ ను వాడుకోవడం. రోజు వార్తపత్రికలు చదవడం, జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్లు చదవడం వల్ల చాలా విశయాలు తెలుసుకున్నాను.ఇది నా మానసిక వికాసానికి ఎంతగానో దోహదం చేసింది.

రోజూ ఉదయాన్నే డ్యాం పైన జాగింగ్, లేక్ వ్యూ చదువులు, స్వర్గీయ కె.ఎస్.ఎన్, లాంటి గొవ్పవారి పాఠాలు వినడం ఎంతో అద్ర్షుష్టం. ఎంత డబ్బు గుమ్నరించినా దొరకని భాగ్యం అది.

ఫైనల్ ఇయర్ లో హాస్టల్ లెక్రటరీ కావడం, ఆపై పాండిచ్చేరి లో ఎం.సి.ఎ, చెన్నై, బెంగుళూరు నగరాల్లో ఉద్యోగం,ప్రస్థుతం హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో ఉద్యోగం చేస్తున్నా.

కష్ఠపడి పోరాడితే ఓటమి పారిపోతుంది,విజయం సొంతం అవుతుంది.సాగర్ జీవితం నేర్పించిన పాఠం ఇది. సాగర్ కాలేజి జ్ఞాపకాలు, జీవితంలోని ఒక ముఖ్యమైన మదుర ఘట్టాన్నీ రివైండ్ చేసుకోవడం లాంటిది.

హరినాథ్ మల్లేపల్లి. B.sc 1997-2000

Comments

Popular posts from this blog

గూడు

The inhumane war

Friends Forever