తెలుగు బ్లాగులు
ఈ రోజు నెను తెలుగు బ్లాగులు ఒకటి రెండు చూసాను. ఛాలా బాగున్నాయి. స్నెహమా అంటూ ఒక కవితల బ్లాగు. అందులోంచి కాపి కొట్టిన కవిథ ఒకటి. తొలి పొద్దులో గరిక పూవుపై మంచు తాకి మైమరచింది నేనేనా? ముంగిట ముగ్గుకి రంగులద్ది మురిసిపోయిన మనిషి నేనేనా? వాన చినుకుల్లో కలిసి తడిసి అలిసిపోయిన మనసు నాదేనా? రేకులు రాలుతున్న పూవును చూసి చెక్కిలి జారిన కన్నీరు నాదేనా? ఏది అప్పటి సున్నితత్వం? ఏది అప్పటి భావుకత్వం? వయసు పెరిగేకొద్దీ మనసు చిన్నదయిపోతుందా? ధనం వచ్చేకొద్దీ ఆనందం విలువ పెరిగిపోతుందా? ఈ కవిత తొలి ప్రచురణ "పొద్దు" లో. http://poddu.net/ పడమటి గొదావరి రాగం అంటూ పలకరించిన శ్రీనివాస్ గారి బ్లాగ్. ఆకలి విలువ చాలా చక్కగా చెప్పారు. "ఎదుటి వాడి ఆకలి బాధతెలియాలి అంటే ఒక్కరోజు ఆకలితో గడపాలి.., దూరమైనప్పుడే దేని విలువ అయినా తెలిసేది... అని అప్పుడే తెలుసుకున్నాడు." And then for those who want to blog in telugu Veeven's lekhini is the one of the best i have ever come across