Posts

Showing posts from February, 2009

Millionaire Slumdog

It was nice to watch the Oscar awards function in the T.V. Interesting thing to see was A.R. Rahman and Rasool receiving the awards. Rasool made "Dedicated to country" while Rahman said "Mere pass Maa Hain". More details can be had from rediff and other online resources This Mumbai slumdog winning maximum awards at the function is really great. I think, if you know rules of the game, winning is easy. Our movie makers should make a note of it. and win awards at international events like this.

నాగార్జున సాగర్ గురుకుల డిగ్రీ కళాశాల

నాగార్జున సాగర్ గురుకుల డిగ్రీ కళాశాల రజత్సోవ సంచికకు ఎదయినా రాయాలి అని గత వారం రోజులుగా అనుకుంటున్నా, కాని అర్థం కావడం లేదు ఎక్కడ మోదలు పెట్టాలో. కరువు జిల్లా పాలమూరు లో,దిగువ మధ్యతరగతిలో పుట్టడం వల్ల,చదువంతా కష్టంగా గడిచింది.జడ్చర్లలో ఇంటర్ కాగానే చదువు ఆగుతుందా,సాగుతుందా అని చింతిస్తున్న సమయంలో ఆపద్భాధవుడి మాదిరిగా దొరికింది సాగర్ కాలేజిలో ప్రవేశం. ఇక్కటి ప్రశాంత వాతవరణం,చదువు,వసతి, భోజనం ఉచితం కావడం బాగా కలసి వచ్చింది, దానికి తోడు రాష్ట్రం నలుమూలల నుంచి విధ్యార్థులు ఉండటం,మంచి అధ్యాపకులు ఉండటం జీవితంపై ఆశను పెంచి భవిష్యత్తుకు మంచి పునాది రాళ్ళు పడటానికి బాగా దోహదం చేసింది. డిగ్రీ అంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ పి.జి ఎంట్రెన్సులకు ప్రిపేరు కావడం అని కాకుండా,ఇక్కడ నేను చాలా విధాలుగా లబ్ది పొందాను. లైబ్రరీ ను వాడుకోవడం. రోజు వార్తపత్రికలు చదవడం, జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్లు చదవడం వల్ల చాలా విశయాలు తెలుసుకున్నాను.ఇది నా మానసిక వికాసానికి ఎంతగానో దోహదం చేసింది. రోజూ ఉదయాన్నే డ్యాం పైన జాగింగ్, లేక్ వ్యూ చదువులు, స్వర్గీయ కె.ఎస్.ఎన్, లాంటి గొవ్పవారి పాఠాలు వినడం ఎంతో అద్ర్షుష్టం. ఎంత డబ్బ

ఉచితం జాగ్రత్త

ఈ మద్య అన్ని ఉచితంగా ఇచ్చే బజారు వోటు బిచ్చగాళ్ళు వోచ్చారు. సంబరపడి పోకండి, అంతా ఉత్తి ఉత్తిదే. చిన్న పిల్లలు మారం చేస్తే పెద్ద వాళ్ళు ఏదో ఓక కథ చెప్పి మేనేజ్ చేసినట్టు రాజకీయం పేరిట కొంత మంది అవసరం ఉన్నా లేకున్నా ప్రతిది ఉచితంగా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మాటల వరకే సుమా. ఓ ప్రణాళిక లేదు. ఓ పద్దతి లేదు, అసలు ప్రజలకు ఏది అవసరమో తేలీదు. రూపాయి ఎలా వస్తుంది, ఎలా ఖర్చు అవుతోంది తేలీదు. ఎలా చేస్తే బాగుంటుందో అసలు తేలీదు. కానీ అదంతా అనవసరం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ కతలు, కోతలు. దీనికి తోడు మన న్యాయ వ్యవస్థ. అదే చట్టం. కాని, కోర్టు కోర్టు కు తీర్పు మారుతుంది. న్యాయానికి కూడా ఫాలిమార్ఫిజం ఉంటుంది కాబోలు. డబ్బున్న వాడికి అన్నీ దోరుకుతాయి. పోలీసులు గులాం అవుతారు. న్యాయం చుట్టం అవుతుంది.జైళ్లు ప్రత్యేకమవుతాయి. డబ్బున్నవాడు ధన్యుడు,బలమున్న వాడు రాజవుతాడు. భీధవాళ్ళు బలవుతూనే ఉంటారు. ఉచితానుచితాలను పక్కన పెడితే ఇది మాత్రం నిజం.