Monday, February 09, 2009

ఉచితం జాగ్రత్త

ఈ మద్య అన్ని ఉచితంగా ఇచ్చే బజారు వోటు బిచ్చగాళ్ళు వోచ్చారు. సంబరపడి పోకండి, అంతా ఉత్తి ఉత్తిదే. చిన్న పిల్లలు మారం చేస్తే పెద్ద వాళ్ళు ఏదో ఓక కథ చెప్పి మేనేజ్ చేసినట్టు రాజకీయం పేరిట కొంత మంది అవసరం ఉన్నా లేకున్నా ప్రతిది ఉచితంగా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మాటల వరకే సుమా.

ఓ ప్రణాళిక లేదు. ఓ పద్దతి లేదు, అసలు ప్రజలకు ఏది అవసరమో తేలీదు. రూపాయి ఎలా వస్తుంది, ఎలా ఖర్చు అవుతోంది తేలీదు. ఎలా చేస్తే బాగుంటుందో అసలు తేలీదు. కానీ అదంతా అనవసరం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ కతలు, కోతలు.


దీనికి తోడు మన న్యాయ వ్యవస్థ. అదే చట్టం. కాని, కోర్టు కోర్టు కు తీర్పు మారుతుంది. న్యాయానికి కూడా ఫాలిమార్ఫిజం ఉంటుంది కాబోలు. డబ్బున్న వాడికి అన్నీ దోరుకుతాయి. పోలీసులు గులాం అవుతారు. న్యాయం చుట్టం అవుతుంది.జైళ్లు ప్రత్యేకమవుతాయి.

డబ్బున్నవాడు ధన్యుడు,బలమున్న వాడు రాజవుతాడు. భీధవాళ్ళు బలవుతూనే ఉంటారు. ఉచితానుచితాలను పక్కన పెడితే ఇది మాత్రం నిజం.

No comments: